English | Telugu

చిరు ఫ్యాన్స్‌ని శ్రీ‌నువైట్ల మెప్పిస్తాడా??

చిరంజీవి అభిమానిని అని చెప్పుకొంటాడు శ్రీ‌నువైట్ల‌. మెగా కాంపౌండ్ కూడా శ్రీ‌నువైట్ల‌ని బాగానే గుర్తించింది. చిన్న చిన్న సినిమాల‌తో క్రేజ్ తెచ్చుకొని దూసుకుపోతున్న శ్రీ‌నువైట్ల‌ని పిలిచి మ‌రీ అవ‌కాశ‌మిచ్చాడు చిరంజీవి. అలా.. అంద‌రివాడు సినిమా ప‌ట్టాలెక్కింది. అయితే ఆ అవ‌కాశాన్ని నిలుపుకోలేక‌పోయాడు. చిరంజీవికి ఓ అట్ట‌ర్ ఫ్లాప్ అంట‌గ‌ట్టాడు. అప్ప‌టి నుంచీ శ్రీ‌నువైట్ల‌పై మెగా అభిమానులు గుర్రుగాను ఉన్నారు. పిలిచి అవ‌కాశం ఇస్తే నిలుపుకోలేదన్న కోపం వారిది. పైగా సినిమా మ‌రీ చీప్ గా చుట్టేశాడ‌న్న నింద‌లు మోశాడు.

ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌ని ఐస్ చేసే ఆఫ‌ర్ చ‌ర‌ణ్ సినిమాతో వ‌చ్చింది. రామ్‌చ‌ర‌ణ్ - శ్రీ‌నువైట్ల కాంబోలో ఇప్పుడు ఓ సినిమా తెర‌కెక్కుతోంది. చిరు బ‌ర్త్ డేకి ట్రైట‌ర్‌ని కూడా విడుద‌ల చేశారు. ఆ ట్రైట‌ర్ చూసి ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు. చ‌ర‌ణ్‌కైనా ఓ సూప‌ర్ హిట్టిచ్చి.. అంద‌రివాడు చేదు జ్ఞాప‌కాల్ని చెరిపేయాల‌ని శ్రీ‌నువైట్ల ఆలోచ‌న‌. పైగా ఇందులో చిరంజీవి కూడా న‌టిస్తున్నాడు. ప‌నిలో ప‌నిగా చిరు క్యారెక్ట‌ర్‌ని కూడా బాగా తీర్చిదిద్ది... ఆయ‌న ద‌గ్గ‌ర మార్కులు సంపాదించాల‌ని చూస్తున్నాడు.

మ‌రి... ఈసారి శ్రీ‌నువైట్ల నుంచి ఎలాంటి మూవీ వ‌స్తుందో. ఈ సినిమా కూడా అటూ ఇటూ అయితే.. మెగా ఫ్యాన్స్ రియాక్ష‌న్స్ ఎదుర్కోవ‌డం శ్రీ‌నువైట్ల‌కు క‌త్తిమీద సామే.