English | Telugu

శ్రీ‌మంతుడిపై మ‌హేష్ అప్‌సెట్‌... రీషూట్‌??


ఆగ‌డు త‌ర‌వాత త‌న సినిమాల విష‌యంలో మ‌రింత కేర్ తీసుకొంటున్నాడు మ‌హేష్ బాబు. కాస్త ఆల‌స్య‌మైనా.. మంచి సినిమానే ఇవ్వాల‌న్న‌ది మ‌హేష్ ఆలోచ‌న‌. అందుకే ప్ర‌తి సీన్‌ని ఒక‌ట్రెండు సార్లు చెక్ చేస్తున్నాడ‌ట‌. శ్రీ‌మంతుడు సినిమాకొస్తే.. ప్ర‌తి విష‌యంలోనూ మ‌హేష్ క‌లుగ చేసుకొంటున్న‌ట్టు టాక్‌. ఈ చిత్రానికి మ‌హేష్ నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రిస్తుండం వ‌ల్ల ఆ కేర్ ఎక్కువైంద‌ని తెలుస్తోంది. శ్రీ‌మంతుడు ఓవ‌రాల్‌గా మ‌హేష్‌కి న‌చ్చినా, అందులో కొన్ని స‌న్నివేశాల విష‌యంలో అప్ సెట్ అయ్యాడ‌ని టాక్‌. ఆ సీన్స్ ని మ‌ళ్లీ రీషూట్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివను ఆదేశించాడ‌ట మ‌హేష్‌.

ఇటీవ‌లే శ్రీ‌మంతుడు షూటింగ్ మొత్తం పూర్త‌యింది. అయితే మ‌హేష్ సూచ‌న మేర‌కు మ‌ళ్లీ కొర‌టాల త‌న టీమ్ తో రంగంలోకి దిగిపోయాడ‌ట‌. వారం రోజుల్లో ఈ రీషూట్ మొత్తం కంప్లీట్ చేసే అవ‌కాశం ఉంది. మ‌హేష్ జాగ్ర‌త్త‌.. టీమ్‌ని సంతోష‌పెడుతున్నా ప్ర‌తి విష‌యంలోనూ జోక్యం చేసుకోవ‌డం మాత్రం.. ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌ని ఇబ్బందిపెడుతోంద‌ట‌. అయినా.. ఆయ‌న స‌హ‌నంగా ఓర్చుకొంటూ మ‌హేష్ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా సినిమా తీస్తున్నార‌ని చిత్ర‌బృందంలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.