English | Telugu

స్పైడర్‌కు వెన్నుపోటు పొడిచింది ఎవరు..?

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంభినేషన్‌లో తెరకెక్కుతున్న స్పైడర్ మూవీపై టోటల్‌ సౌతిండియన్ మూవీ ఇండస్ట్రీలోనే హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్స్‌తో ఆ హైప్‌ను మరింత పెంచుతూ వస్తోంది చిత్ర యూనిట్. దసరా కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేసి డేట్ కూడా ఎనౌన్స్ చేశారు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ప్రిన్స్ అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. స్పైడర్‌ పాపులారిటీని తగ్గించేందుకు..కలెక్షన్స్ భారీగా తగ్గించేందుకు ఎవరో అజ్ఞాతవ్యక్తులు కుట్ర పన్నారట..కొద్దిరోజుల క్రితం మూవీలోని కొన్ని సీన్లు లీకైనట్లు వార్తలు వచ్చాయి..కానీ వాటిలో నిజం లేదని చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. తాజాగా ట్రైలర్‌ను అఫీషియల్‌గా రిలీజ్ చేయడానికి కొన్ని నిమిషాల ముందు సినిమా ప్రొడ్యూసర్ కాపీ లీక్ అయినట్లు ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. లీక్ అవ్వడం అనేది స్టార్ హీరోల సినిమాలకు కొత్త కాదు..కానీ ట్రైలర్ రిలీజ్‌కు ముందు ఇలా జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతానికి ఈ లీక్ ఎక్కడి నుంచి జరిగిందో తెలుసుకునే పనిలో పడిందట చిత్ర యూనిట్.. లేదంటే సినిమా రిలీజైన తర్వాత కేటుగాళ్లు మరింత రెచ్చిపోయే ప్రమాదముంది.