English | Telugu

బాల‌య్యకి అతిథిగా శ్రుతి హాస‌న్?

`క్రాక్`తో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేశారు టాలెంటెడ్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని, స్టార్ బ్యూటీ శ్రుతి హాస‌న్. క‌ట్ చేస్తే.. ఈ ఇద్ద‌రు మ‌రోసారి క‌లిసి ప‌నిచేయ‌బోతున్న‌ట్లు టాక్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ కాంబినేష‌న్ లో గోపీచంద్ మ‌లినేని ఓ మాస్ ఎంట‌ర్టైన‌ర్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ సినిమా అతి త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. కాగా, ఈ చిత్రంలో ఓ నాయిక‌గా శ్రుతి హాస‌న్ న‌టించ‌బోతుంద‌ని ఆ మ‌ధ్య‌ ప్ర‌చారం సాగింది. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. శ్రుతి ఈ సినిమాలో హీరోయిన్ గా కాకుండా అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతోంద‌ట‌. అంతేకాదు.. బాల‌య్య కాంబినేష‌న్ లోనే శ్రుతి పాత్ర తాలూకు స‌న్నివేశాలు ఉంటాయ‌ని వినికిడి. మ‌రి.. ఈ క‌థ‌నాల్లో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

ఒక‌వేళ బాల‌య్య - గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ మూవీలో శ్రుతి న‌టించ‌డం ఖాయ‌మైతే.. `బ‌లుపు`, `క్రాక్` చిత్రాల త‌రువాత గోపీచంద్ - శ్రుతికి ఇది హ్యాట్రిక్ వెంచ‌ర్ అవుతుంది. విశేష‌మేమిటంటే.. ఆ సినిమాల‌కు సంగీత‌మందించిన యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ నే ఈ చిత్రానికి కూడా బాణీలు అందిస్తున్నాడు.