English | Telugu

ఓయ్ భామ మళ్లీ హాయ్ అంటోంది!

చైల్డ్ ఆర్టిస్టుగా నంబర్ వన్ ప్లేస్ లో కొనసాగిన షామిలీ హీరోయిన్ గా తొలిప్రయత్నమే బెడిసికొట్టింది. ఓయ్ అట్టర్ ఫ్లాప్ అవడంతో పాటూ....సీక్రెట్ దాచి దాచి స్క్రీన్ మీద చూపించిన షామిలీ ఆకట్టుకోలేపోయింది. దీంతో అమ్మడు బైబై చెప్పేసింది. ఓ దశలో మళ్లీ ముఖానికి రంగేసుకోదన్నంత ప్రచారం వచ్చింది. మరి ఆరేళ్ల తర్వాత ఏమనుకుందో ఏమో....మళ్లీ కమెరా ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతోందట.

కన్నడ స్టార్ సుదీప్ హీరోగా తమిళం, కన్నడంలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా ఫిక్సైంది. రజనీకాంత్ లింగాతో దెబ్బతిన్న రవికుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. మరి రీఎంట్రీలో అయినా ఓయ్ భామ హాయిగా పలకరిస్తుందా? లింగ దెబ్బ నుంచి రవికుమార్ కోలుకుంటాడా? చూద్దాం.