English | Telugu

'లైగ‌ర్‌'తోనూ సామ్ చిందులు?

పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిన 'పుష్ప - ద రైజ్' కోసం "ఊ అంటావా మామా.. ఉఊ అంటావా మామా" అంటూ సాగే పాట‌లో త‌న చిందుల‌తో క‌నువిందు చేసింది చెన్నై పొన్ను స‌మంత‌. త‌న కెరీర్ లోనే తొలి ప్ర‌త్యేక గీతంగా రూపొందిన ఈ ఊర‌మాస్ నంబ‌ర్.. జాతీయ స్థాయిలో సంచ‌ల‌నం సృష్టించింది.

Also read:ప్రెగ్నెంట్ గా స‌మంత‌!?

క‌ట్ చేస్తే.. మ‌రోమారు స్పెష‌ల్ సాంగ్ లో ఎంట‌ర్టైన్ చేసేందుకు సామ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని బ‌జ్. ఆ వివ‌రాల్లోకి వెళితే.. యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ 'లైగ‌ర్' పేరుతో ఓ స్పోర్ట్స్ డ్రామాని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ అన‌న్యా పాండే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో వెట‌ర‌న్ యాక్ట్ర‌స్ ర‌మ్య‌కృష్ణ హీరో త‌ల్లిగా ఓ ముఖ్య పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది.

Also read:​చైతూతో విడాకుల‌ పోస్ట్‌ను తొల‌గించిన సామ్‌.. ఇద్ద‌రూ మ‌ళ్లీ క‌లుస్తున్నారా?

కాగా, క‌థానుసారం ఈ సినిమా ద్వితీయార్ధంలో ఓ స్పెష‌ల్ డాన్స్ నంబ‌ర్ వ‌స్తుంద‌ట‌. ఆ గీతం కోసం సామ్ తో సంప‌ద్రింపులు జ‌రిపార‌ట విజ‌య్ అండ్ కో. 'మ‌హాన‌టి' నుంచి విజ‌య్ తో ఉన్న అనుబంధం దృష్ట్యా స‌మంత కూడా ఈ పాట‌కి ఓకే చెప్పింద‌ని టాక్. త్వ‌ర‌లోనే 'లైగ‌ర్'లో సామ్ ఎంట్రీపై క్లారిటీ రానున్న‌ది. మ‌రి.. మ‌రోసారి పాన్ - ఇండియా స్పెష‌ల్ నంబ‌ర్ తో స‌మంత ఎంట‌ర్టైన్ చేస్తుందో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. అన్న‌ట్టు.. ఆగ‌స్టు 25న 'లైగ‌ర్' థియేట‌ర్స్ లోకి రాబోతోంది.