English | Telugu

30 రోజుల టార్గెట్‌తో ర‌వితేజ‌?

సంక్రాంతికి విడుద‌లైన కాప్ డ్రామా `క్రాక్`తో కెరీర్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ అందుకున్నాడు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. `క్రాక్` స‌క్సెస్ ఇచ్చిన `కిక్`తో.. వ‌రుస సినిమాలు క‌మిట్ అవుతూ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ నేప‌థ్యంలోనే.. మే 28న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ఖిలాడి`తో సంద‌డి చేయ‌నున్నాడు మాస్ మ‌హారాజా. ఇందులో ర‌వితేజ రెండు విభిన్న పాత్ర‌ల్లో అల‌రించ‌నున్నాడు.

ఇదిలా ఉంటే.. ఉగాది సంద‌ర్భంగా ర‌వితేజ ఓ కొత్త సినిమాని ప‌ట్టాలెక్కించిన సంగ‌తి తెలిసిందే. శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తుండ‌గా.. `మ‌జిలీ` ఫేమ్ దివ్యాంశ కౌశిక్ నాయిక‌గా న‌టిస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని ఓ టార్గెట్ తో పూర్తిచేయ‌బోతున్నాడ‌ట ర‌వితేజ‌. అదేమిటంటే.. కేవ‌లం 30 వ‌ర్కింగ్ డేస్ లో త‌న షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేయ‌బోతున్నాడ‌‌ట‌. అంతేకాదు.. రూ.8 కోట్ల పారితోషికం ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కి అందుకోబోతున్న‌ట్లు స‌మాచారం. మ‌రి.. ఈ క‌థ‌నాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, `నేను లోక‌ల్` డైరెక్ట‌ర్ త్రినాథ‌రావ్ న‌క్కిన కాంబినేష‌న్ లోనూ ర‌వితేజ ఓ మూవీ చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది.