English | Telugu

ర‌వితేజ‌, రామ్.. ఓ మ‌ల్టిస్టార‌ర్?

మాస్ మ‌హారాజా ర‌వితేజ, ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్.. ఇద్ద‌రూ ఇద్ద‌రే. తెర‌పై క‌నిపించినంత సేపు హుషారైన న‌ట‌న‌తో అల‌రించేవారే. అలాంటి ఈ ఇద్ద‌రు.. ఒకే సినిమాలో క‌లిసి న‌టిస్తే? అలాంటి ఆలోచ‌న‌కు తెర‌రూపం తీసుకువ‌చ్చే ప‌నిలో ఉన్నార‌ట స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `ఎఫ్ 2`తో తొలిసారి మ‌ల్టిస్టార‌ర్‌ని తెర‌కెక్కించి బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందుకున్న అనిల్ రావిపూడి.. ప్ర‌స్తుతం `ఎఫ్ 2` స్టార్స్ విక్ట‌రీ వెంక‌టేశ్, మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌తోనే `ఎఫ్ 3` చేస్తున్నారు. `ఎఫ్ 2`కి సీక్వెల్‌గా `ఎఫ్ 3` రూపొందుతోంది. ఈ సినిమా త‌రువాత న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ఓ సినిమా చేసేందుకు అనిల్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఆపై ర‌వితేజ‌తో `రాజా ది గ్రేట్` సీక్వెల్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. కాగా, ఇందులో ర‌వితేజ‌తో పాటు రామ్ కూడా మ‌రో హీరోగా న‌టించ‌నున్నార‌ని టాక్. మ‌రి.. ఈ క‌థ‌నాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, ర‌వితేజ ప్ర‌స్తుతం `ఖిలాడి`తో బిజీగా ఉన్నారు. అలాగే శ‌ర‌త్ మండ‌వ‌, త్రినాథ‌రావ్ న‌క్కినతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయ‌నున్నారు. ఇక రామ్ విష‌యానికొస్తే.. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఓ బైలింగ్వ‌ల్ మూవీ చేస్తున్నారు.