English | Telugu

మరో క్రేజీ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పిన రష్మిక..!

ర‌ష్మిక మంద‌న్నా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ర‌ష్మిక.. తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.

మలయాళ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్, టాలీవుడ్ డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. స్వప్న సినిమా- వైజయంతీ మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ మూవీలో ఒక హీరోయిన్ గా మృణాళ్ ఠాకూర్ న‌టిస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్టుకు ర‌ష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం ర‌ష్మిక‌ను గ‌తంలో నిర్మాత‌లు సంప్ర‌దించ‌గా డేట్స్ స‌ర్దుబాటు కాక‌పోవ‌డంతో నో చెప్పిందట. అయితే రీసెంట్ గా మళ్ళీ ఈ ప్రాజెక్ట్ కు ర‌ష్మిక ఓకే చెప్పిందని టాక్. త్వరలో రష్యాలో జరిగే షెడ్యూల్లో రష్మిక జాయిన్ అవుతుందని సమాచారం.

కాగా, రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన 'పుష్ప', శర్వానంద్ జోడీగా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాలలో నటిస్తోంది. ఇక బాలీవుడ్ లో మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.