English | Telugu

సైన్స్ స్టూడెంట్ గా ర‌ష్మిక‌!?

క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ భాష‌ల్లో న‌టిగా త‌న‌దైన ముద్ర వేసిన నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్న‌.. త్వ‌ర‌లో బాలీవుడ్ లోనూ అడుగుపెడుతున్న సంగ‌తి తెలిసిందే. సిద్ధార్ధ్ మ‌ల్హోత్రాకి జోడీగా ర‌ష్మిక న‌టించిన స్పై థ్రిల్ల‌ర్ `మిష‌న్ మ‌జ్ను` జూన్ 10న విడుద‌ల కానుండ‌గా.. బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ కి కూతురిగా న‌టిస్తున్న `గుడ్ బై` కూడా ఇదే సంవ‌త్స‌రం జ‌నం ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే, తాజాగా `అర్జున్ రెడ్డి`, `క‌బీర్ సింగ్` చిత్రాల ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న బాలీవుడ్ మూవీ `యానిమ‌ల్`లోనూ క‌థానాయిక‌గా న‌టించే ఛాన్స్ ప‌ట్టేసింది ర‌ష్మికా మంద‌న్న‌. ఇందులో స్టార్ హీరో ర‌ణ్ బీర్ క‌పూర్ కి జంట‌గా ఎంట‌ర్టైన్ చేయ‌నుంది ఈ `భీష్మ‌` బ్యూటీ. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఇందులో సైన్స్ స్టూడెంట్ రోల్ లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ట ర‌ష్మిక‌. అంతేకాదు.. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర ఇద‌ని స‌మాచారం. మ‌రి.. ఈ సినిమాతో ర‌ష్మిక న‌టిగా ఎలాంటి గుర్తింపుని, ఫ‌లితాన్ని పొందుతుందో చూడాలి.

కాగా, `యానిమ‌ల్`లో అనిల్ క‌పూర్, బాబీ డియోల్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. 2023 ఆగ‌స్టు 11న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌పైకి రాబోతోంది.