English | Telugu

విజ‌య్ కి జోడీగా రాశీ ఖ‌న్నా!

ప్ర‌స్తుతం చేతినిండా సినిమాలున్న క‌థానాయిక‌ల్లో ఉత్త‌రాది భామ రాశీ ఖ‌న్నా ఒక‌రు. తెలుగునాట‌ `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్`, `థాంక్ యూ` చిత్రాల్లో న‌టిస్తున్న‌ రాశి.. త‌మిళంలో `స‌ర్దార్`, `తిరుచిత్రాంబ‌లం`, `మేధావి`, `సైతాన్ కా బచ్చా`.. హిందీలో `యోధ‌` చేస్తోంది. అలాగే రెండు వెబ్ - సిరీస్ ల‌తోనూ బిజీగా ఉంది.

Also Read:అప్పుడు హీరోయిన్.. ఇప్పుడు విల‌న్..!?

ఇదిలా ఉంటే, తాజాగా రాశీ ఖ‌న్నాకి ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో న‌టించే ఛాన్స్ ద‌క్కింద‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. `మ‌హ‌ర్షి` వంటి విజ‌యవంత‌మైన చిత్రం త‌రువాత ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ఓ బైలింగ్వ‌ల్ మూవీ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ విజ‌య్ హీరోగా న‌టించ‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీని ప్ర‌ముఖ నిర్మాత `దిల్` రాజు ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ ని కుదిరితే దీపావ‌ళికి లేదంటే 2023 సంక్రాంతికి రిలీజ్ చేసే దిశ‌గా ప్లానింగ్ జ‌రుగుతోంది.

Also Read:విజయ్-పూరి కాంబోలో మరో మూవీ.. హీరోయిన్ గా జాన్వీ కపూర్!

కాగా, ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా రాశిని ఎంపిక చేశార‌ని బ‌జ్. అదే గ‌నుక నిజ‌మైతే.. అటు విజ‌య్ తోనూ, ఇటు వంశీ పైడిప‌ల్లితోనూ త‌న‌కి ఇదే మొద‌టి సినిమా అవుతుంది. ఇక `దిల్` రాజు నిర్మాణంలో ఇప్ప‌టికే `సుప్రీమ్`, `శ్రీ‌నివాస క‌ళ్యాణం` చిత్రాలు చేసింది రాశి. ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న `థాంక్ యూ` కూడా రాజు బేన‌ర్ లోనే తయార‌వుతోంది. త్వ‌ర‌లోనే విజ‌య్ - వంశీ - `దిల్` రాజు మూవీలో రాశి ఎంట్రీపై క్లారిటీ రానున్న‌ది.