English | Telugu

బాలీవుడ్‌లో కలకలం..డ్రగ్స్ తీసుకున్న రణ్‌బీర్‌కపూర్..!

డ్రగ్స్.. ఈ మాట వింటే చాలు ఇప్పుడు దేశం మొత్తం ఉలిక్కిపడుతోంది. అందుకు కారణం హైదరాబాద్‌లో స్కూలు విద్యార్థులు డ్రగ్స్ సేవించడం..టాలీవుడ్‌లో సినీ ప్రముఖులకు డ్రగ్స్ కేసులో సంబంధాలున్నట్లు పోలీసులు నోటీసులు ఇవ్వడం వంటి వరుస ఘటనలతో డ్రగ్స్ అన్న పదాన్ని గూగుల్‌లో ట్రెండింగ్ అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని మిగిలిన చిత్ర పరిశ్రమల్లోని నటీనటుల్ని కూడా సగటు పౌరుడు అనుమానించే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తాను డ్రగ్స్ వాడినట్లు అంగీకరించాడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్..ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో తనకు పాఠశాలకు వెళ్లే రోజుల్లో డ్రగ్స్ వాడే అలవాటు ఉండేదని, కానీ ఆ తర్వాత పూర్తిగా మానేశానంటూ చెప్పాడు. అంతేకాదు ఓ సినిమాలో సన్నివేశం కోసం చాలా తక్కువ మొత్తంలో డ్రగ్స్ తీసుకున్నట్లు చెప్పాడు..