English | Telugu

మహేష్ టైటిల్ కొట్టేసిన రామ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో క్రిష్ 'శివమ్‌' అనే సినిమా తీస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని మహేష్‌ కూడా అప్పట్లో చెప్పాడు కానీ ఆ సినిమా మెటీరియలైజ్‌ అవలేదు. అయితే తాజాగా ఇదే టైటిల్‌ హీరో రామ్ సినిమా చేస్తున్నట్లు సమాచారం. రామ్‌ హీరోగా శ్రీనివాస్‌రెడ్డి అనే కొత్త దర్శకుడు తీయబోతున్న చిత్రానికి శివమ్‌ అనే టైటిల్‌ ఖరారైంది. నిజానికి శ్రీనివాస్‌రెడ్డి ఈ చిత్రాన్ని నితిన్‌ హీరోగా తీద్దామని అనుకున్నాడు. ఆ చిత్రం ఓపెనింగ్‌ కూడా అయిన తర్వాత ఆగిపోయింది. నితిన్‌ తప్పుకోవడంతో ఆ కథ రామ్‌కి వెళ్లింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.