English | Telugu
రామ్ తో రష్మిక రొమాన్స్!?
Updated : Mar 15, 2022
`పుష్ప - ద రైజ్`తో పాన్ - ఇండియా యాక్ట్రస్ అయిపోయింది నేషనల్ క్రష్ రష్మికా మందన్న. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన హిందీ చిత్రాలు `మిషన్ మజ్ను`, `గుడ్ బై` విడుదలకు సిద్ధమయ్యాయి. మరోవైపు.. `పుష్ప` సెకండ్ పార్ట్ `పుష్ప - ద రూల్` త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
ఇదిలా ఉంటే, తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో పాన్ - ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ వివరాల్లోకి వెళితే.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఓ బహుభాషా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. బోయపాటి మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ బడా ప్రాజెక్ట్.. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నిర్మాణం జరుపుకోనుంది. కాగా, ఈ సినిమాలో రామ్ కి జోడీగా రష్మికా మందన్నని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే రామ్ - బోయపాటి కాంబో మూవీలో రష్మిక ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. రామ్, రష్మిక తొలిసారిగా జట్టుకట్టనున్న ఈ సినిమా.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
కాగా, రామ్ ప్రస్తుతం `ద వారియర్` అనే ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ కాప్ డ్రామాని లింగుస్వామి డైరెక్ట్ చేస్తుండగా.. రామ్ సరసన కృతి శెట్టి నటిస్తోంది. జూలైలో ఈ సినిమా విడుదల కావచ్చని టాక్.