English | Telugu

చ‌ర‌ణ్‌ ని అలా గాలికొదిలేస్తే ఎట్టా..??

రామ్‌చ‌ర‌ణ్ సినిమాల విష‌యంలో చిరంజీవి జోక్యం ఎక్కువైపోయింద‌ని గ‌గ్గోలు పెడుతున్నారంతా! చ‌ర‌ణ్‌తో సినిమా చేయ‌డాలంటే.. అన్ని విధాలా చిరుని సంతృప్తిప‌ర‌చాల్సిందే అని.. లేక‌పోతే చ‌ర‌ణ్ సినిమా ప‌ట్టాలెక్క‌డం క‌ష్ట‌మ‌ని తేల్చేస్తున్నారు. బ్రూస్లీ వర‌కూ.. చ‌ర‌ణ్‌పై చిరు ప్ర‌భావం ఓ రేంజులో సాగింది. అయితే త‌నివ‌రువ‌న్ విష‌యంలో మాత్రం చిరు ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని టాక్‌. 'నీ ఇష్టం వ‌చ్చిన‌ట్టు చేసుకో.. నాకు చెప్ప‌కు' అని చ‌ర‌ణ్‌కి పూర్తి ఫ్రీడ‌మ్ ఇచ్చేశాడ‌ట‌. ఇది ఫ్రీడ‌మ్ అనుకోవాలా, లేదంటే... నాకు సంబంధం లేదంటూ డాడీ త‌న‌ని గాలికొదిలేశాడో చ‌ర‌ణ్ తేల్చుకోలేక‌పోతున్నాడ‌ని టాక్‌. తుఫాన్‌, గోవిందుడు అంద‌రివాడేలే, బ్రూస్లీ సినిమాల విష‌యంలో చిరు విప‌రీత‌మైన జోక్యం చేసుకొన్నాడ‌ని మీడియా టాక్‌. ఆయా సినిమాల‌కు ప‌నిచేసిన ద‌ర్శ‌కులు కూడా అదే విష‌యం చాటుమాటుగా చెప్పుకొంటుంటారు. అయితే ఈ సినిమాల‌న్నీ ప‌ట్టుమ‌న్నాయి. చ‌ర‌ణ్ క‌థ‌ల విష‌యంలో త‌న జ‌డ్జిమెంట్ త‌ప్ప‌డంతో చిరు కూడా పీల‌వుతున్నాడ‌ట‌. ఈనాటి జ‌న‌రేష‌న్ ప‌ల్స్ ప‌ట్టుకోవ‌డం త‌న‌కు సాధ్యం కావ‌డం లేద‌ని భావిస్తున్నాడ‌ట‌. అందుకే చ‌ర‌ణ్ సినిమాల‌కు సంబంధించి తాను డెసిషన్ తీసుకోలేక‌పోతున్నాడ‌ని టాక్‌. 'నీకు ఏ క‌థ చేయాల‌నిపిస్తే అది చేయ్‌' అంటూ చ‌ర‌ణ్ నిర్ణ‌యానికే వ‌దిలేశాడ‌ట చిరు. చ‌ర‌ణ్ ఇప్ప‌టికే ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ఈ ద‌శ‌లో హిట్టుకొట్ట‌క‌పోతే కెరీర్ మ‌రింత స్లో అవుతుంది. ఈ ద‌శ‌లో చిరు.. చ‌ర‌ణ్‌ని అలా వ‌దిలేయ‌డం కూడా భావ్యం కాదు. ఒక‌వేళ త‌నిఒరువ‌న్ కూడా ప‌ట్టాలు త‌ప్పితే.. అప్పుడు చిరు మ‌ళ్లీ చ‌ర‌ణ్ కోసం ఆలోచిస్తాడేమో చూడాలి.