English | Telugu

`స‌ర్కారోడు`గా చ‌ర‌ణ్!?

ఆ మ‌ధ్య కోలీవుడ్ స్టార్ విజ‌య్ `స‌ర్కార్` అంటూ సంద‌డి చేశారు. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు `స‌ర్కారు వారి పాట‌`తో బిజీగా ఉన్నారు. కట్ చేస్తే.. ఇప్పుడీ స్టార్స్ త‌ర‌హాలోనే మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా త‌న సినిమాకి `స‌ర్కార్` ట‌చ్ ఇవ్వ‌బోతున్నార‌ట‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబినేష‌న్ లో రామ్ చ‌ర‌ణ్ ఓ భారీ బ‌డ్జెట్ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నాయిక‌గా న‌టిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. కాగా, ఇందులో సివిల్ స‌ర్వీసెస్ ఆఫీస‌ర్ గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు చ‌ర‌ణ్. అందుకే.. పాత్ర రీత్యా సినిమాకి `స‌ర్కారోడు` అనే టైటిల్ ని ఫిక్స్ చేశార‌ట‌. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ కావ‌డంతో ఇత‌ర భాష‌ల‌కు వేరే టైటిల్స్ ప్లాన్ చేస్తున్నార‌ని బ‌జ్. చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మార్చి 27న ఈ టైటిల్, ఫ‌స్ట్ లుక్ తో కూడిన స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్ కావ‌చ్చ‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే `స‌ర్కారోడు` టైటిల్ పై ఫుల్ క్లారిటీ రానుంది.

ఇదిలా ఉంటే, చ‌ర‌ణ్ - శంక‌ర్ సినిమాలో శ్రీ‌కాంత్, జ‌య‌రామ్, ఎస్. జే. సూర్య‌, అంజ‌లి, సునీల్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ కి స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నారు.