English | Telugu

చ‌ర‌ణ్, అలియా.. వ‌న్స్ మోర్?

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. జూలై నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని టాక్. ఇందులో చ‌ర‌ణ్ నెవ‌ర్ సీన్ బిఫోర్ రోల్ లో క‌నిపిస్తాడ‌ని వినికిడి.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ కి జోడీగా న‌టించే నాయిక‌పై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ర‌ష్మికా మంద‌న్న‌, కియారా అద్వాణీ, ర‌కుల్ ప్రీత్ సింగ్ తో పాటు సౌత్ కొరియ‌న్ యాక్ట్ర‌స్ బే సుజీ పేరు కూడా ఈ జాబితాలో వినిపించింది. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో నాయిక‌గా న‌టించబోతోంద‌ట‌.

ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న `ఆర్ ఆర్ ఆర్`లో చ‌ర‌ణ్ కి జోడీగా అలియా న‌టిస్తోంది. క‌ట్ చేస్తే.. మ‌రోమారు ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ నే శంక‌ర్ కూడా రిపీట్ చేయ‌నుండ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది. మ‌రి.. చ‌ర‌ణ్, అలియా జోడీ వన్స్ మోర్ అంటుందో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, `ఆర్ ఆర్ ఆర్` ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 13న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.