English | Telugu
రజినీకాంత్ స్టైల్ మారింది
Updated : Sep 18, 2015
సీనియర్ డైరెక్టర్ లతో వరుస సినిమాలు చేసి ఎదురు దెబ్బలు తిన్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. అందుకే ఈసారి రూటు మార్చారు. రెండు సినిమాల అనుభవమున్న రంజిత్ అనే యువ దర్శకుడితో పని చేయబోతున్నారు. రజినీ పోషిస్తున్న పాత్ర ఈ సినిమా కథాంశం కూడా రజినీ ఇమేజ్ కు భిన్నంగా ఉండబోతున్నాయని సమాచారం. ‘కబాలి’లో కబాలీశ్వరన్ అనే వయసు మీద పడ్డ డాన్ పాత్ర పోషించబోతున్నాడు రజినీ. మలేషియాలో మగ్గుతున్న తమిళ కూలీల కోసం చెన్నై నుంచి అక్కడికి వెళ్లి.. వారిని కాపాడే పాత్రలో కనిపించబోతున్నాడట రజినీ. ఐతే రొటీన్ గా రజినీ సినిమాలో ఉండే బిల్డప్పులు ఇందులో కనిపించవని.. సరిగ్గా తన వయసుకు తగ్గట్లే రజినీ ప్రవర్తిస్తాడని.. రంజిత్ తొలి రెండు సినిమాల తరహాలోనే ఈ సినిమా రియలిస్టిక్ గా ఉంటుందని.. కోలీవుడ్ వర్గాల సమాచారం. డైలాగ్స్, ఫైట్స్ లో మాత్రం సిగ్నేచర్ స్టయిల్స్ వుంటాయని అంటున్నారు. అదే నిజమైతే రజినీ మంచి నిర్ణయం తీసుకున్నట్లే.