English | Telugu

స్వీటీకి రాజ‌మౌళి టార్చ‌ర్‌!

ఓ వైపు సైజ్ జీరో భారీ ఫ్లాప్‌ని మూట‌గ‌ట్టుకొన్న బాధ‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న అనుష్క‌కు.. మ‌రోవైపు నుంచి రాజ‌మౌళి టార్చ‌ర్ పెడుతున్నాడా??? స్వీటీని ఒక‌ర‌కంగా ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా???? అవున‌నే గుస‌గుస‌లాడుకొంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. సైజ్ జీరో త‌ర‌వాత బాహుబ‌లి 2 షూటింగ్‌లో జాయిన్ అవ్వాలి అనుష్క. అయితే.. స్వీటీ మాత్రం అందుకు సిద్దంగా లేదు. కార‌ణం.. సైజ్ జీరో కోసం పెరిగిన బ‌రువే.ఈ సినిమా కోసం దాదాపుగా 18 కిలోల బ‌రువు పెరిగింది. మ‌ళ్లీ త‌గ్గ‌డానికి నానా యాత‌న ప‌డుతోంది స్వీటీ.

ఇప్ప‌టికి క‌ష్ట‌ప‌డి ఏదోలా 8 కిలోలు త‌గ్గింద‌ట‌. ఇంకో ప‌ది కిలోలు త‌గ్గాల్సి ఉంది.మ‌రోవైపు బాహుబ‌లి 2 షూటింగ్ ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. పార్ట్ 1లో అనుష్క పాత్ర‌కు స్కోప్ లేదుగానీ.. పార్ట్ 2 మాత్రం అనుష్క చుట్టూనే న‌డుస్తుంది. కాబ‌ట్టి వీలైనంత త్వ‌ర‌గా అనుష్క మ‌ళ్లీ య‌ధాస్థానానికి వ‌చ్చేయాలి. 8 కిలోలు త‌గ్గ‌డానికి రెండు నెల‌ల స‌మ‌యం తీసుకొంది స్వీటీ. మ‌రో ప‌ది రోజుల్లో ప‌ది కిలోలు త‌గ్గ‌డం అసాధ్యం. దాంతో రాజ‌మౌళి టెన్ష‌న్ లో ప‌డిపోయాడు.

డిసెంబ‌రు ద్వితీయార్థంలో బాహుబ‌లి 2 షూటింగ్ మొద‌లుకానుంది. ఈలోగా అనుష్క ని డే అండ్ నైట్ వ‌ర్క‌వుట్స్ చేయ‌మ‌ని రాజ‌మౌళి స‌తాయిస్తున్నాడ‌ని, ఒక‌వేళ బ‌రువు త‌గ్గ‌క ఇలానే ఉంటే.. షూటింగ్‌కి రావ‌ల‌సిన అవ‌స‌రం లేద‌ని డైరెక్టుగా చెప్పేశాడ‌ట‌. దాంతో స్వీటీ తెగ కంగారు ప‌డిపోతోంద‌ట‌. ఒక‌వైపు సైజ్ జీరో ఫ్లాప‌యిన బాధ‌లో ఉంటే.. మ‌రోవైపు బాహుబ‌లి 2 చేజారిపోతుందేమో అనే భ‌యం కూడా ప‌ట్టుకొంది. పాపం.. స్వీటీకి ఇది బ్యాడ్ టైమే.