English | Telugu

హ‌వ్వ‌.. ఆ హీరోని న‌గ్నంగా...

రాంగోపాల్ వ‌ర్మ ఏం చేసినా సంచ‌ల‌న‌మే. ఫ్లాపులు ఎదురైనా.. ఇప్ప‌టికీ మిగిలిన ద‌ర్శ‌కుల‌క‌న్నా కాస్త భిన్నంగా ఆలోచిస్తుంటాడు. అయితే ఆ క్రియేటివిటీ కాస్త అప్పుడప్పుడూ ప‌రిధులు దాటి ప్రేక్షకుల స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తుంటుంది. ఈమ‌ధ్య క‌థానాయిక‌ల్ని అర్థ‌న‌గ్నంగా చూపించ‌డం అల‌వాటు చేసుకొన్న వ‌ర్మ‌.. ఈసారి వెరైటీగా ఉంటుంద‌ని హీరోని పూర్తి న‌గ్నంగా చూపించ‌బోతున్నాడ‌ని టాక్‌.

వివ‌రాల్లోకి వెళ్లే.. వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్ త‌రుణ్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్క‌బోతోంది. ఇదో మూకీ మూవీ అట‌. అందుకే.. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌.. ఇలా వీలైన‌న్ని భాష‌ల్లో ఈసినిమాని విడుద‌ల చేయాల‌నుకొంటున్నాడు వ‌ర్మ‌, వ‌ర్మ అంత‌టోడు అడిగేస‌రికి... క‌థ విన‌కుండానే రాజ్ త‌రుణ్ సినిమా చేయ‌డానికి ఒప్పేసుకొన్నాడు. తీరా చూస్తే.. ఇందులో న్యూడ్ గా న‌టించాల్సిన సీన్ ఒక‌టుంద‌ట‌. ఆ షాట్ కూడా వ‌ర్మ చాలా క‌న్వెన్సింగ్ గా చెప్పేస‌రికి రాజ్ త‌రుణ్ కూడా త‌ల ఊపేశాడ‌ని టాక్‌.

హీరో, డైరెక్ట‌ర్ ఇద్ద‌రూ బాగా మాట్లాడుకొని.. `న్యూడ్ సీన్‌` చేయ‌డానికి ప్రిపేర‌యిపోయారు స‌రే.... మ‌రి ఈ సీన్ చూడాల్సిన ప్రేక్ష‌కుల సంగ‌తేంటో?? మొత్తానికి వ‌ర్మ మాయ‌లో ప‌డిపోయాడు ఓ కుర్ర‌హీరో. పాపం.. చివ‌రికి వ‌ర్మ అత‌న్ని ఎక్క‌డ తేలుస్తాడో?