English | Telugu

స‌ల్మాన్ - పూరితో మైత్రీ చిత్రం?

క్రేజీ ప్రాజెక్ట్స్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తున్న నిర్మాణ సంస్థ‌ల్లో మైత్రీ మూవీ మేక‌ర్స్ ఒక‌టి. ప్ర‌స్తుతం `పుష్ప‌`, `భ‌వ‌దీయుడు..! భ‌గ‌త్ సింగ్`, `మెగాస్టార్ 154` (బాబీ డైరెక్టోరియ‌ల్) `ఎన్బీకే 107` (గోపీచంద్ మ‌లినేని డైరెక్టోరియ‌ల్), `ఎన్టీఆర్ 31`(ప్ర‌శాంత్ నీల్ చిత్రం).. ఇలా ప‌లు భారీ బ‌డ్జెట్ మూవీస్ ఈ హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ‌లోనే త‌యార‌వుతున్నాయి. వీటిలో `పుష్ప‌`, `ఎన్టీఆర్ 31` పాన్ - ఇండియా ప్రాజెక్ట్స్ గా సంద‌డి చేయ‌నున్నాయి.

ఇదిలా ఉంటే.. మైత్రీ మూవీ మేక‌ర్స్ నుంచి మ‌రో పాన్ - ఇండియా మూవీ రాబోతోంద‌ని టాక్. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా ఈ సినిమా ఉంటుంద‌ని స‌మాచారం. అంతేకాదు.. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ఈ భారీ బ‌డ్జెట్ వెంచ‌ర్ ని తెర‌కెక్కించ‌నున్నార‌ని బ‌జ్. త్వ‌ర‌లోనే స‌ల్మాన్ - పూరి కాంబో మూవీపై క్లారిటీ రానుంది. మ‌రి.. పూరి రూపొందించిన `పోకిరి` హిందీలో `వాంటెడ్`గా రీమేక్ అయి సల్మాన్ కి బ్లాక్ బ‌స్ట‌ర్ అందించిన నేప‌థ్యంలో.. పూరీ ద‌ర్శ‌క‌త్వంలో నేరుగా న‌టించ‌నున్న ఈ సినిమాతోనూ స‌ల్లూ భాయ్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.

కాగా, పూరీ జ‌గ‌న్నాథ్ ఆన్ గోయింగ్ మూవీ `లైగ‌ర్` కూడా పాన్ - ఇండియా మూవీనే కావ‌డం విశేషం. రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా.. 2022లో తెర‌పైకి రానుంది.