English | Telugu
'లైగర్` కోసం ప్రియా ప్రకాశ్ చిందులు!?
Updated : Mar 22, 2022
గత ఏడాది `చెక్`, `ఇష్క్` చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించింది వింక్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్. త్వరలో ఈ అమ్మడు మరో తెలుగు సినిమాలో కనిపించబోతోందట. అయితే, ఈ సారి హీరోయిన్ గా కాదు.. ఐటమ్ గాళ్ గా..
ఆ వివరాల్లోకి వెళితే.. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో `లైగర్` పేరుతో ఓ స్పోర్ట్స్ డ్రామా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే కథానాయికగా నటించగా.. కథానుసారం వచ్చే ఓ ప్రత్యేక గీతంలో మరో యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా సందడి చేయనుందట. త్వరలోనే `లైగర్`లో ప్రియా ప్రకాశ్ ఎంట్రీపై క్లారిటీ రానున్నది. మరి.. ఈ స్పెషల్ సాంగ్ తోనైనా ప్రియా ప్రకాశ్ వారియర్ ఖాతాలో తొలి హిట్ క్రెడిట్ అవుతుందేమో చూడాలి.
కాగా, `లైగర్`లో మైక్ టైసన్, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. `అర్జున్ రెడ్డి` (2017) రిలీజ్ డేట్ అయిన ఆగస్టు 25న `లైగర్` ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.