English | Telugu

హాలీవుడ్ మూవీ 'మిషన్‌ ఇంపాజిబుల్‌ 7'లో ప్రభాస్!!

బాహుబలి తరువాత రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ మారిపోయింది. వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ వంటి భారీ బడ్జెట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ప్రభాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ ఓ క్రేజీ హాలీవుడ్ మూవీలో నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది.

హాలీవుడ్‌ సినిమా ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’లో ప్రభాస్‌ నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. క్రిస్టోఫర్‌ మెక్‌ క్వారీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో టామ్‌ క్రూజ్‌ తో కలసి ప్రభాస్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇండియన్ యాక్టర్ ప్రభాస్‌ ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’ లో ఓ కీలక పాత్ర చేయడానికి ముందుకు వచ్చారని డైరెక్ట‌ర్ క్రిస్టోఫర్‌ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు సమాచారం.

గ‌త ఏడాది ‘రాధేశ్యామ్’ షూటింగ్ కోసం ప్ర‌భాస్ ఇట‌లీ వెళ్లిన‌ప్పుడు డైరెక్ట‌ర్ క్రిస్టోఫ‌ర్ ప్ర‌భాస్‌ ను క‌లిసి స్క్రిప్ట్ నెరేట్ చేశాడట. ఆ స్క్రిప్ట్ కి ప్ర‌భాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా త‌న పాత్ర‌కు సంబంధించిన స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌ను కూడా పూర్తి చేశాడని న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతోంది. కాగా, ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’ సినిమా 2022 మే 27న విడుదల కానుంది.