English | Telugu

రాజ‌మౌళితో ప్ర‌భాస్ కి చెడిందా??

ప్ర‌భాస్ కి ఛ‌త్ర‌ప‌తి లాంటి బ్లాక్ బ్ల‌స్ట‌ర్ హిట్ ఇచ్చాడు రాజ‌మౌళి. ఆ రోజు నుంచీ.. రాజ‌మౌళి పేరుని ప్ర‌భాస్ జ‌పిస్తూనే ఉన్నాడు. బాహుబ‌లి ఆఫ‌ర్ ప్ర‌భాస్ ని వెదుక్కొంటూ రావ‌డం వెనుక‌..రాజ‌మౌళితో ప్ర‌బాస్‌కి ఉన్న స్నేహ‌మూ కార‌ణ‌మే. ప్ర‌భాస్ కూడా బాహుబ‌లి కోసం చాలా త్యాగాలు చేశాడు. కేవ‌లం జ‌క్క‌న్న‌పై న‌మ్మ‌కంతో త‌న మూడేళ్ల కెరీర్ ని త్యాగం చేశాడు. బాహుబ‌లి త‌ర‌వాత క్రెడిట్ అంతా రాజ‌మౌళికే వెళ్లిపోయినా.. మౌనం దాల్చాడు. త‌న‌కు ఇష్టం లేక‌పోయినా.. బాహుబ‌లి ని రెండు భాగాలుగా మారిస్తే ఓర్చుకొన్నాడు.

అయితే.. ఇప్పుడు ఈ అనుబంధానికి పుల్ స్టాప్ ప‌డిపోయింది. బాహుబ‌లి 2 త‌ర‌వాత రాజ‌మౌళి కాంపౌండ్‌లో ఉండకూడ‌ద‌ని ప్ర‌భాస్ భావిస్తున్న‌ట్టు టాక్‌. అందుకే బాహుబ‌లి త‌దుప‌రి సిరీస్ ల‌లో న‌టించ‌కూడ‌ద‌ని ప్ర‌భాస్ నిర్ణ‌యించుకొన్నాడ‌ట‌. బాహుబ‌లి సీరీస్ ని కొన‌సాగించాల‌న్న‌ది రాజ‌మౌళి ఆలోచ‌న‌. పార్ట్ 3 గురించి విజ‌యేంద్ర ప్ర‌సాద్ కూడా క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. అయితే రాబోయే ప్రాజెక్టుల నుంచి త‌ప్పుకొంటున్న‌ట్టు ప్ర‌భాస్ ముందే స్ప‌ష్టం చేశాడ‌ట‌. దాంతో బాహుబ‌లి పార్ట్ 3 నుంచి రాజ‌మౌళి ప్ర‌భాస్‌నీ త‌ప్పించాడు.

ఒకే కాంపౌండ్‌లో ఐదారేళ్లు ప‌నిచేయ‌డం ప్ర‌భాస్ కి ఇష్టం లేద‌ట‌. దానికితోడు సినిమా ఎంత హిట్ట‌యినా క్రెడిట్ మొత్తం రాజ‌మౌళి ఖాతాలోనికే వెళ్లిపోవ‌డం కూడా ప్ర‌భాస్ కి న‌చ్చ‌డం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా మిగిలిన ద‌ర్శ‌కుల‌తో ప్ర‌భాస్ కొన్ని ప్రాజెక్టులు ఒప్పుకొన్నాడు. అవ‌న్నీ అవ్వాలంటే.. రాజ‌మౌళి స్కూల్ నుంచి బ‌య‌ట‌కు రావాల్సిందే. అందుకే రాజ‌మౌళితో బాహుబ‌లి 3 చేయ‌డానికి ప్ర‌భాస్ ఏమాత్రం స‌ముఖంగా లేడ‌ని.. అందుకే పార్ట్ 3 కోసం రాజ‌మౌళి మ‌రో హీరో పేరుని పరిశీలిస్తున్నాడ‌ని టాక్‌. మొత్తానికి రాజ‌మౌళి - ప్ర‌భాస్ ల బంధానికి బాహుబ‌లి పార్ట్ 2తో తెర‌ప‌డిన‌ట్టైంది.