English | Telugu

బ‌జ్: అతి త్వ‌ర‌లో `రాధే శ్యామ్` నుంచి `ప్రేర‌ణ‌` టీజ‌ర్!

`రాధే శ్యామ్`.. 2022 సంక్రాంతికి వెండితెర‌పై వెలుగులు పంచ‌నున్న ప్ర‌ణ‌య దృశ్య కావ్యం. విక్ర‌మాదిత్య, ప్రేర‌ణ అనే జంట మ‌ధ్య సాగే ఈ పిరియ‌డ్ రొమాంటిక్ సాగాలో విక్ర‌మాదిత్యగా యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, ప్రేర‌ణ‌గా `బుట్ట‌బొమ్మ‌` పూజా హెగ్డే ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. `జిల్` రాధాకృష్ణ రూపొందించిన ఈ భారీ బ‌డ్జెట్ మూవీ.. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా ఎంట‌ర్టైన్ చేయ‌నుంది.

ఇదిలా ఉంటే.. ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 23న `విక్ర‌మాదిత్య` పాత్ర తాలూకు టీజ‌ర్ ని ఆంగ్ల భాష‌లో రిలీజ్ చేసిన యూనిట్.. అతి త్వ‌ర‌లో `ప్రేర‌ణ‌` పాత్రకు సంబంధించిన టీజ‌ర్ ని కూడా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. అంతేకాదు.. ఈ టీజ‌ర్ లో విక్ర‌మాదిత్య‌, ప్రేర‌ణ మ‌ధ్య సాగే విజువ‌ల్స్ కి కూడా చోటివ్వ‌నున్నార‌ట‌. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, `రాధే శ్యామ్`లో రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు, జ‌య‌రామ్, భాగ్య‌శ్రీ‌, స‌చిన్ ఖేద్క‌ర్, ప్రియ‌ద‌ర్శి, ముర‌ళీ శ‌ర్మ‌, కునాల్ రాయ్ క‌పూర్, స‌త్య‌న్, సాషా చెట్రి, ఫ్లోరా జ‌కోబ్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. యూవీ క్రియేష‌న్స్, టి-సిరీస్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మించాయి.