English | Telugu

విలాస‌వంత‌మైన ఫామ్‌హౌస్‌ను క‌ట్టించ‌బోతున్న ప్ర‌భాస్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప‌న్నెండేళ్ల క్రితం హైద‌రాబాద్‌లోని సైబ‌ర్ సిటీలో ఒక ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేశాడు. అయితే అది రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు చెందిన స్థ‌లంగా పేర్కొంటూ అధికారులు కొంత కాలం క్రితం నోటీసులు జారీచేశారు. దాన్ని కోర్టులో స‌వాలు చేశాడు ప్ర‌భాస్‌. ఇప్పుడు న్యాయ‌ప‌ర‌మైన అడ్డంకులు తొల‌గి, ఆ స్థ‌లంపై ఆయ‌న‌కు క్లియ‌ర్ టైటిల్ ల‌భించింది. దాంతో ప్ర‌భాస్ పాత ఫామ్‌హౌస్‌ను కూల‌గొట్టి, విలాస‌వంత‌మైన, ఆధునిక స‌దుపాయాల‌తో సరికొత్త ఫామ్‌హౌస్‌ను క‌ట్టించాల‌ని భావిస్తున్న‌ట్లు ఇండ‌స్ట్రీలో చెప్పుకుంటున్నారు. ముంబైకి చెందిన ఆర్కిటెక్ట్‌కు దాని డిజైన్ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించాడంట‌.

Also read:'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ ఎఫెక్ట్.. మా థియేటర్స్ కి సెక్యూరిటీ కావాలి!

ప్ర‌స్తుతం దేశంలోనే అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న యాక్ట‌ర్‌గా ప్ర‌భాస్ నిలుస్తున్నాడు. ఆయ‌న పారితోషికం సౌత్ ఇండియా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌ను మించిపోయింది. 'బాహుబ‌లి' సిరీస్ త‌ర్వాత ఆయ‌న ప్ర‌తి సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌ల‌వుతుండ‌టంతో ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల‌కు పైగా పారితోషికాన్ని తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం.

Also read:విడాకుల తర్వాత చనిపోతాననుకున్నా!

విడుద‌ల‌కు సిద్ధ‌మైన 'రాధే శ్యామ్' మూవీని మిన‌హాయిస్తే, ప్ర‌భాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అవి.. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న‌ 'స‌లార్‌', ఓమ్ రౌత్ రూపొందిస్తోన్న 'ఆదిపురుష్‌', నాగ్ అశ్విన్ తీస్తున్న 'ప్రాజెక్ట్ కె', సందీప్‌రెడ్డి వంగా డైరెక్ట్ చేయ‌నున్న‌ 'స్పిరిట్‌'. వీటి ద్వారా వ‌చ్చిన డ‌బ్బును జాగ్ర‌త్త‌గా ఇన్‌వెస్ట్ చేస్తున్నాడు ప్ర‌భాస్‌. ఇటీవ‌లే అత‌ను వ‌ర‌ద బాధితులను ఆదుకొనే నిమిత్తం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. కోటి విరాళం ప్ర‌క‌టించాడు.