English | Telugu

'ఎఫ్ 3'లో పూజా హెగ్డే స్పెష‌ల్ సాంగ్!?

నాలుగేళ్ళ క్రితం సంచ‌ల‌నం సృష్టించిన `రంగ‌స్థ‌లం` (2018) చిత్రంలో "జిల్ జిల్ జిగేల్ రాణి" అంటూ ఓ ఐట‌మ్ సాంగ్ చేసింది బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే. క‌ట్ చేస్తే.. ఇప్పుడు మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ కోసం త‌న చిందుల‌తో క‌నువిందు చేయ‌నుంద‌ట‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. 2019 నాటి సంక్రాంతి విజేత `ఎఫ్ 2`కి సీక్వెల్ గా `ఎఫ్ 3` పేరుతో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. విక్ట‌రీ వెంక‌టేశ్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, స్ట‌న్నింగ్ బ్యూటీ మెహ్రీన్ ముఖ్య పాత్ర‌ల్లో కొన‌సాగనున్న ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్టైన‌ర్ లో క‌థానుసారం ఓ స్పెష‌ల్ సాంగ్ కి స్కోప్ ఉంద‌ట‌. అందులో పూజా హెగ్డే ఎంటర్టైన్ చేయ‌నుంద‌ని స‌మాచారం. అంతేకాదు.. పూజ‌తో పాటు వెంకీ, వ‌రుణ్, త‌మ‌న్నా, మెహ్రీన్ కూడా ఈ గీతంలో ఆడిపాడ‌నున్నార‌ని బ‌జ్. త్వ‌ర‌లోనే `ఎఫ్ 3`లో పూజా హెగ్డే ఎంట్రీపై క్లారిటీ రానుంది. మ‌రి.. `రంగ‌స్థ‌లం`లాగే `ఎఫ్ 3` కూడా పూజ కెరీర్ కి ప్ల‌స్ అవుతుందేమో చూడాలి.

కాగా, వ‌రుస విజ‌యాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న `ఎఫ్ 3`ని స్టార్ ప్రొడ్యూస‌ర్ `దిల్` రాజు నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ బాణీలు అందిస్తున్న ఈ సినిమా వేస‌వి కానుక‌గా మే 27న విడుద‌ల కానుంది.