English | Telugu

పూజ - త‌మ‌న్ కాంబో హ్యాట్రిక్ కొడుతుందా!?

`అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌`, `మ‌హ‌ర్షి`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్`, `అల వైకుంఠ‌పుర‌ములో`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` వంటి ఐదు వ‌రుస విజ‌యాల త‌రువాత బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే నుంచి రాబోతున్న సినిమా `రాధే శ్యామ్`. పిరియ‌డ్ ల‌వ్ సాగాగా రూపొందిన ఈ చిత్రంలో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కి జంట‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది పూజ. `జిల్` రాధాకృష్ణ తెర‌కెక్కించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి.. యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ నేప‌థ్య‌సంగీతం అందించాడు.

Also Read: అక్కినేని అఖిల్ తో కరణ్ జోహార్ పాన్ ఇండియా ఫిల్మ్

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. గ‌తంలో త‌మ‌న్, పూజ కాంబినేష‌న్ లో వ‌చ్చిన చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి. 2018లో వ‌చ్చిన `అర‌వింద స‌మేత‌` అఖండ విజ‌యం సాధించ‌గా.. 2020లో రిలీజైన `అల వైకుంఠ‌పుర‌ములో` సంచ‌ల‌నం సృష్టించింది. ఈ నేప‌థ్యంలో.. ముచ్చ‌ట‌గా మూడోసారి ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న‌ `రాధే శ్యామ్` కూడా స‌క్సెస్ బాట ప‌డుతుందేమో చూడాలి.

కాగా, `రాధే శ్యామ్`లో రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్య‌శ్రీ‌, జ‌గ‌ప‌తి బాబు, జ‌య‌రామ్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. మ‌నోజ్ ప‌ర‌మ‌హంస ఛాయాగ్ర‌హ‌ణం అందించిన ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ రేపు (మార్చి 11) థియేట‌ర్స్ లోకి రాబోతోంది.