English | Telugu

ఫ్లాప్ ద‌ర్శ‌కుడ్ని ప‌ట్టుకొన్న ప‌వ‌న్‌??

ప‌వ‌న్ క‌ల్యాణ్ అంతే.. ఎప్పుడు ఎవ‌రికి అవ‌కాశం ఇస్తాడో చెప్ప‌లేం. హిట్లూ, ఫ్లాపులూ ప‌ట్టించుకోకుండా మెగా ఫోన్ తీసుకెళ్లి ఆ ద‌ర్శ‌కుడి చేతిలో పెట్టేసి షాకుల మీద షాకులు ఇచ్చేస్తుంటాడు. మ‌రోసారి త‌న స్టైల్‌లోనే ఓ ఫ్లాప్‌ద‌ర్శ‌కుడ్ని పిలిచి మ‌రీ అవ‌కాశం ఇచ్చాడ‌ట‌. ఆ ద‌ర్శ‌కుడెరో కాదు. పంజా తీసిన విష్ణువ‌ర్థ‌న్‌.

త‌మిళంలో స్టైలీష్ డైరెక్ట‌ర్‌గా పేరుగాంచిన విష్ణువ‌ర్థ‌న్ ప‌వ‌న్‌తో పంజా తీశాడు. అయితే ఆ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని డిఫరెంట్‌గా చూపించాల‌నుకొన్న అత‌ని ప్ర‌య‌త్నం కూడా ఏమాత్రం ఫ‌లించ‌లేదు. పంజా త‌ర‌వాత తెలుగులో విష్ణు పేరు త‌ల‌చుకొన్న‌వాళ్లే లేరు. అయితే త‌మిళంలో మాత్రం ఆరంభం సినిమాతో ఓ హిట్ కొట్టి మ‌ళ్లీ ప్రూవ్ చేసుకొన్నాడు విష్ణు.

దాంతో మ‌ళ్లీ ప‌వ‌న్ నుంచి పిలుపు అందుకొన్నాడ‌ట‌. పంజా ఫ్లాప్‌ని మ‌ర్చిపోయి క‌ల‌సి ప‌నిచేద్దాం అన్నాడ‌ట ప‌వ‌న్‌. దాంతో విష్ణు షాకైపోయాడ‌ట‌. అందుకే ఈమ‌ద్య ఓ త‌మిళ‌ ఆడియో ఫంక్ష‌న్లో విష్ణు ప‌వ‌న్‌ని ఆకాశానికి ఎత్తేస్తూ పొగిడేశాడు. ప‌వ‌న్ అంత ధీరుడు లేడూ అంటూ త‌మిళ మీడియా ముందు.. ప‌వ‌న్‌కి కీర్తించాడు. సో.. ప‌వ‌న్ - విష్ణుల పంజా దెబ్బ మ‌ళ్లీ రుచి చూడ‌బోతున్నామ‌న్న‌మాట‌.