English | Telugu

స‌మంత కోసం... మ‌హేష్ ఓదార్పు యాత్ర‌

వ‌న్ పోస్ట‌ర్‌పై స‌మంత లేపిన దుమారం గుర్తుందా?? వ‌న్ పోస్ట‌ర్‌ మ‌హిళ‌ల్ని కించ‌ప‌రిచేవిధంగా ఉంద‌ని స‌మంత ఓ ట్వీట్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది. దాంతో స‌మంత‌పై మ‌హేష్ అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ రోజుల్లో ఏం జ‌రిగిందో మ‌హేష్ పూస గుచ్చిన‌ట్టు చెప్పాడు. త‌న ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో స‌మంత భ‌య‌ప‌డిపోయింద‌ట‌.

మ‌హేష్ కి ఫోన్ చేసి... తెగ బాధ‌ప‌డింద‌ట‌. ఆ స‌మ‌యంలో మ‌హేష్ స‌మంత‌ని ఓదార్చ‌డ‌ట‌. అంతే కాదు, త‌న ఫ్యాన్స్‌కి స‌ర్దిచెప్పాడ‌ట‌. ఇలాంటి విష‌యాల్లో ఆగ్ర‌హావేశాలు ప్ర‌ద‌ర్శించ‌కూడ‌ద‌ని కూల్ చేశాడ‌ట‌. దాంతో పాటు స‌మంత‌కూ కొన్ని స‌ల‌హాలు ఇచ్చాడ‌ట‌. ట్విట్ట‌ర్‌లో ఓ అంశం గురించి రాసేముందు.. కాస్త ముందూ వెనుకా చూసుకోమ‌ని స‌ల‌హా ఇచ్చాడ‌ట‌.

అప్ప‌టి నుంచి స‌మంత పూర్తిగా కంట్రోల్‌లోకి వచ్చేసింద‌ట‌. స‌మంత‌తో మ‌ళ్లీ న‌టించొద్ద‌ని ఫ్యాన్స్ గొడ‌వ పెట్టినా.. కాద‌ని బ్ర‌హ్మోత్స‌వంలో స‌మంత‌ని రిక‌మెండ్ చేశాడ‌ట మ‌హేష్. ఒక్క ట్విట్టు వెనుక ఎంత స్టోరీ న‌డిచిందో క‌దా..? మొత్తానికి ఈ సున్నిత‌మైన విష‌యాన్ని అంతే సున్నితంగా డీల్ చేసి మ‌హేష్ మంచి ప‌నే చేశాడు.