English | Telugu
పవన్- హరీష్ శంకర్ మూవీ టైటిల్ 'భగత్ సింగ్'!!
Updated : Sep 6, 2021
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీకి 'భగత్ సింగ్' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ సినిమాకు టైటిల్ గా 'భవదీయుడు-భగత్ సింగ్' లేదా 'భగత్ సింగ్' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. 'గబ్బర్ సింగ్' తరువాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు 'భగత్ సింగ్' అన్నది యాప్ట్ టైటిల్ అవుతుందని, అందుకే అది ఫిక్స్ చేసారని అంటున్నారు. అదీగాక ఈ సినిమా 'గబ్బర్ సింగ్'లా కంప్లీట్ కమర్షియల్ మూవీ కాదని.. కమర్షియల్ అంశాలతో పాటు సోషల్ మెసేజ్ ఉంటుందని అందుకే 'భగత్ సింగ్' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా పవన్ ప్రస్తుతం 'భీమ్లా నాయక్', 'హరిహర వీరమల్లు' చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ ప్రాజెక్ట్ పట్టాలేక్కనుంది. అనంతరం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.