English | Telugu

పవన్‌, త్రివిక్రమ్‌లిద్దరికి కలిసొచ్చిన సెంటిమెంట్లు ఇవే..!

టాలీవుడ్ అంటే సెంటిమెంట్లకు పెట్టింది పేరు..ఫలానా సినిమా ఫలానా రోజు తీశామనో, ఆ హీరోకి మూడక్షరాల పేరు కలిసొచ్చిందనో, క్లాప్ కొట్టిన రోజు, మెగా ఫోన్ పట్టిన రోజు అంటూ ఇలా ఎన్ని నమ్మకాలో టాలీవుడ్‌లో.. ఎందుకంటే కోట్ల వ్యాపారంతో కాబట్టి ఏమాత్రం అటు ఇటైనా జీవితాలే తలక్రిందులవుతాయి..అందుకే ఏ మాత్రం రిస్క్ తీసుకోరు మనోళ్లు..ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే..

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హిట్ కొట్టి చాలా రోజులు అవుతుంది. మంచి కిక్ ఇచ్చే హిట్టు కోసం పవన్ అభిమానులు ఎదురుచూస్తున్నారు..ప్రస్తుతం తన దర్శకత్వంలో పవ‌ర్‌స్టార్ నటిస్తున్న మూవీ కోసం పైన చెప్పిన కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతున్నారు. గతంలో అత్తారింటికి దారేది సినిమా కోసం పవన్ పాడిన పాట బాగా హిట్టయ్యింది..దీంతో ఈ మూవీలోనూ పవర్‌స్టార్‌తో ఓ పాట పాడించాలని త్రివిక్రమ్ డిసైడ్ అయ్యారు. అలాగే అదే సినిమాలో తాత క్యారెక్టర్ చేసిన బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీని కూడా ఈ సినిమాకు తీసుకుని ఆయనతో కీలకమైన పాత్ర చేయిస్తున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తుంది..మరి ఈ సెంటిమెంట్లకు సంబంధించి టాలీవుడ్‌లో నడుస్తున్న పుకార్ల గురించి తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.