English | Telugu
పవన్ మామిడి పళ్ల కథ
Updated : Jun 26, 2014
పూర్వకాలంలో ఒక వ్యక్తికి రాజమహల్ నుంచి కబురు వచ్చిన, కనీసం అక్కడి ఛాయలకు సంబంధించిన ఏ విషయమైనా అతని పేరుతో జోడిస్తే చాలు, దానిని కథలు కథలుగా కొన్ని ఏళ్ల పాటు చెప్పుకునేవారట. ఇప్పుడు ఆ పరిస్థితి కొన్ని విషయాలలో కనిపిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఏ విషయమైన ఇంతకన్నా ఎక్కువ హడావుడిగా చేస్తోంది.
పవన్ మామిడి పళ్ల విషయం చూస్తే అలాగే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తన మామిడి పళ్ల తోట నుంచి ప్రతి ఏడు తన సన్నిహితులకు పళ్లు పంపిస్తుంటాడట. ఈ సారి ఆ మామిడి పళ్లు ఎప్పుడూ లేనంతగా చర్చలోకి వచ్చాయి. ఈ పళ్లు వచ్చాయని గంతులు వేసిన వారి గురించి అదే పనిగా మాట్లాడుకున్నారు. తర్వాత అన్నయ్యకు పండ్లు పంపలేదు ఎందుకబ్బా అంటూ చోద్యంగా కబుర్లాడుకున్నారు. తాజాగా నాకు ఎందుకు పంపలేదు అని ఒక దొరసాని గొడవకు దిగుతానంటోందట.. ఏమైనా పవన్ కళ్యాణ్ ఏమి చేసిన రిచ్ గానే వుంటుంది. రాజా దర్పం కనిపిస్తుంది. అలాంటప్పుడు ఆయన చేసిన, చెయ్యని ప్రతి పని వింతే అనిపిస్తుందేమో.. ఎన్నికల తర్వాత షూటింగ్ లతో బిజీగా వున్న పవన్ అసలు ఇవన్నీ పట్టించుకుంటున్నాడో లేదో..