English | Telugu

'కంచె'ను టార్గెట్ చేసిన పవన్ ఫ్యాన్స్!!

చిరంజీవి 60 వ పుట్టిన రోజు వేడుక‌ల్లో నాగబాబు ఆవేశంతో మాట్లాడిన మాట‌లు ప‌వ‌న్ ఫ్యాన్స్ కు గుండెల్లో తూటాలా త‌గిలాయి. ప‌వ‌న్ ఫ్యాన్స్ తో ఎలాంటి చిక్కులు వ‌స్తాయో ఊహించ‌లేక‌పోయారునాగబాబు. స‌రిగ్గా అదే జ‌ర‌గ‌బోతుంది. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఇప్పుడు నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ ను టార్గెట్ చేశార‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. న‌వంబ‌ర్ లో వ‌రుణ్ హీరోగా న‌టించిన కంచె సినిమా విడుద‌ల‌వుతుంది. సినిమా రిలీజైన ఆ ధియేట‌ర్ల ఛాయ‌ల‌కు కూడా పోకూడ‌ద‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ రెండు రాష్ర్టాల్లో స‌మావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం. ఇదే గ‌నుక జ‌రిగితే వ‌రుణ్ తేజ్ చిక్కుల్లో ప‌డ‌టం ఖాయం. ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్నాడు. ఇంత‌లోనే ఉప్పెన లాంటి స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. తండ్రి ఆవేశంతో తూలిన మాట‌లు కొడుకు పై తీవ్రంగా ప్ర‌భావం చూపే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది.