English | Telugu

హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్ లో అల్లు అర్జున్!

'పుష్ప: ది రైజ్' సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే త్వరలో బన్నీ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించనుందని అంటున్నారు. బన్నీకి హాలీవుడ్ నుంచి ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

 

ఇటీవల అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన 40వ ఇండియా డే పెరేడ్ లో బన్నీ పాల్గొన్న సంగతి తెలిసిందే. అమెరికా పర్యటన  సమయంలో హాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ దర్శకుడు బన్నీని కలిసినట్లు తెలుస్తోంది. తాను డైరెక్ట్ చేయబోయే ఒక భారీ యాక్షన్ ఫిల్మ్ లో బన్నీని నటింప చేయాలన్న ఉద్దేశంతో ఆయన కలిసినట్లు సమాచారం. బన్నీ సైతం హాలీవుడ్ ఎంట్రీ పట్ల ఆసక్తిగానే ఉన్నట్లు న్యూస్ వినిపిస్తోంది.

 

ప్రస్తుతం పుష్ప పార్ట్-2 షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడు బన్నీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకుడు. అయితే 'పుష్ప-2' తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఏంటన్న దానిపై ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ అది నిజంగానే హాలీవుడ్ ఫిల్మ్ అయితే మాత్రం బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవు.