English | Telugu

పవన్ రికార్డ్ ను కొట్టేసిన ఎన్టీఆర్

టీఆర్పీ రేటింగ్స్‌లో నెంబర్ వన్‌గావున్న ‘గబ్బర్‌సింగ్’ రికార్డు ను టెంపర్ బద్దలుకొట్టిందా? సినిమా దెబ్బకు మిగతా సినిమాల స్థానాలు తారుమారయ్యాయా? అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. టెలివిజన్ రేటింగ్‌ లో ఇప్పటికి వరకు గబ్బర్‌ సింగ్‌ (24) దే హయ్యస్ట్‌ రేటింగ్. ఆ తరువాత ఈగ (22), మగధీర (21.5)తొలి మూడు స్థానాల్లో కొనసాగుతూ వచ్చాయి. గత ఆదివారం జెమినీ టీవీలో టెలికాస్ట్ అయిన టెంపర్, 26.5 టెలివిజన్ రేటింగ్‌ పాయింట్లతో టాప్‌లో నిలిచిందంటూ ప్రచారం సాగుతోంది. టెంపర్‌ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చిన షేర్‌ 43.1 కోట్లే వచ్చింది. దీంతో ఫ్యాన్స్ కొంచెం నిరాశ చెందారు. కానీ బుల్లితెరపై రికార్డులు సృష్టించడంతో ఖుషీ అవుతున్నారు.