English | Telugu

వినాయకచవితి రోజున ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో.. దీనిపై ఫ్యాన్స్ కి మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటనైతే వచ్చింది కానీ.. మరే ఇతర అప్డేట్ రాలేదు. త్వరలో ఈ మూవీ నుండి కీలక అప్డేట్ రానుందని తెలుస్తోంది.

సుధాకర్ మిక్కిలినేని, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతలుగా ఎన్టీఆర్- కొరటాల కాంబినేషన్ లో సినిమా రానుందని ఈ ఏడాది ఏప్రిల్ లో అప్డేట్ వచ్చింది. అయితే ఆ తర్వాత ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ఈ మూవీలో హీరోయిన్ ఎవరు? టెక్నీషియన్లు ఎవరు? అంటూ చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ మూవీ హీరోయిన్, ఇతర నటీనటులు, టెక్నీషియన్లు తదితర వివరాలను ప్రకటించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వినాయకచవితి కానుకగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించనుందని సమాచారం.

కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొరటాల ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఇక కొరటాల .. మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య'ని పూర్తి చేసి ఎన్టీఆర్ మూవీని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు.