English | Telugu

నితిన్ హ్యాండిచ్చేశాడా?

అ.ఆ త‌ర‌వాత నితిన్ సినిమా ఏదీ ప‌ట్టాలెక్క‌లేదు. రెండు సినిమాలు కొబ్బ‌రికాయ్ కొట్టుకొన్నాయ్ గానీ, షూటింగ్ మొద‌లెట్ట‌లేదు. అందులో హ‌ను రాఘ‌వ‌పూడి, కృష్ణ‌చైత‌న్య సినిమాలున్నాయి. వీటిలో ముందుగా హ‌ను రాఘ‌వ‌పూడి సినిమానే ప‌ట్టాలెక్కుతుంద‌నుకొన్నారు. అయితే హ‌ను రాఘ‌వ‌పూడికి నితిన్ హ్యాండిచ్చేశాడ‌ని టాక్‌.

పారితోషికం ద‌గ్గ‌ర నితిన్‌కీ, ఈ చిత్ర‌బృందానికీ మ‌ధ్య పేచీ వ‌చ్చింద‌ని, నితిన్ ఏకంగా రూ.5 కోట్లు అడుగుతున్నాడ‌ని, అంత ఇవ్వ‌లేమ‌ని 14 రీల్స్ సంస్థ తేల్చి చెప్పింద‌ని, అందుకే ఈ సినిమా ఆగిపోయింద‌ని చెప్పుకొంటున్నారు. నితిన్ స్థానంలో మ‌రో క‌థానాయ‌కుడ్ని వెదికే ప‌నిలో ఉంది చిత్ర‌బృందం. అ.ఆకి ముందు నితిన్ పారితోషికం రూ.3.5 కోట్లు మాత్ర‌మే. అయితే అ.ఆ రూ.50 కోట్లు దాట‌డంతో త‌న పారితోషికాన్ని రూ.5 కోట్ల‌కు పెంచేశాడ‌ని చెబుతున్నారు. కేవ‌లం పారితోషికం పెంచాడ‌న్న కార‌ణంతోనే నితిన్ ని ప‌క్క‌న పెట్టి, మ‌రో హీరోని ప‌ట్టుకొనే ప‌నిలో ఉంది చిత్ర‌బృందం.