English | Telugu

కొరియర్‌బాయ్‌ లక్కీ టైమ్ నడుస్తోంది

ఎప్పుడు విడుదలవుతుందో తెలియని నితిన్ 'కొరియర్‌బాయ్‌ కళ్యాణ్‌'కి ఒక్కసారిగా రెక్కలొచ్చి ఈ గురువారం విడుదలైపోతోంది. ఈ చిత్రంలో వెరైటీ స్క్రీన్‌ప్లే వుండడంతో తప్పకుండా మన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే ధీమాని నితిన్‌ వ్యక్తం చేస్తున్నాడు. రొటీన్‌ సినిమాల నుంచి బ్రేక్‌ కోరుకునే వారికి థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే చిత్రమని చెబుతున్నాడు. లక్కీగా దీనికి పోటీగా మరో సినిమా కూడా లేకపోవడంతో వినాయకచవితికి నితిన్‌ పండగ చేసుకుంటాడు. ఇక నిర్మాతగా మారి తీసిన భారీ చిత్రం 'అఖిల్‌'కి ఖర్చయిన దాని కంటే ఎక్కువే వచ్చేయడంతో తన డబ్బు గురించి బెంగ లేకుండా వున్నాడు. ప్రస్తుతం నితిన్‌ టైమ్‌ భలేగా నడుస్తోంది కదా!!