English | Telugu

ఆలస్యాన్ని కీర్తిపై తోసేసిన నాని..?

రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న హీరో నాని. లాస్ట్ ఇయర్ మూడు సినిమాలు రిలీజ్ చేసి ప్రేక్షకులను మాయ చేశాడు నాని. అన్ని అనుకున్నట్లు జరిగితే నేను లోకల్ కూడా డిసెంబర్ నెలలోనే విడుదలవ్వాల్సింది..కానీ అనుకోని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది..అయితే అందుకు కారణం నానినే నంటూ ఫిలింనగర్‌లో వార్తలు హల్‌చల్ చేశాయి. సినిమా క్లైమాక్స్‌ నానికి నచ్చలేదని అందుకే దానిని రీషూట్ చేయాలని చెప్పాడని అందువల్లే నేనులోకల్ ఫిబ్రవరికి మారిందని సినిమా జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే దీనిపై స్పందించాడు నాని..సినిమా ఆలస్యమైంది తన వల్ల కాదని హీరోయిన్ కీర్తిసురేష్‌ డేట్స్ లేకపోవడం వల్లే షూటింగ్ ఆలస్యమైందని..చాలా సీన్లను రీ షూట్ చేశారని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చాడు.