English | Telugu

నయన్ మూడో బాయ్‌ఫ్రెండ్‌ను కూడా వదిలేయబోతుందా..?

నయనతారకు లవ్ ఎఫైర్స్‌కి విడదీయరాని అనుబంధం ఉంది. కెరీర్ మంచి పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు హీరో శింబుతో నడిపిన ప్రేమాయణం, ఆ తర్వాత కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో పెళ్లి దాకా వెళ్లి ఆ వెంటనే బ్రేకప్‌తో వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది నయన్. కాని గతాన్ని మరచిపోయి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస సూపర్‌హిట్లతో సౌత్‌లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ఇదంతా పక్కనబెడితే తమిళ యువ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో నయన్ ఎఫైర్ నడుపుతోందని వీరిద్దరూ అల్రెడి పెళ్లి చేసుకున్నారని కోలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈ జంట ఎక్కడా బయటపడలేదు.

కానీ ఈ మధ్య వీరిద్దరికి అస్సలు పడటం లేదట. పెళ్లి విషయాన్ని బయటపెడదామని విఘ్నేశ్, వద్దని నయనతార తీవ్ర స్థాయిలో గొడవ పడుతున్నారట.తనకు పెళ్లయ్యిందని తెలిస్తే...అవకాశాలు తగ్గిపోతాయని అందుకే ఇప్పుడప్పుడే ఈ నిజాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు నయనతార ఇష్టపడటం లేదని కోలీవుడ్ టాక్. మరోవైపు చేతిలో ఉన్న సినిమాలను కంప్లీట్ చేసిన తర్వాత విఘ్నేశ్‌కు నయన్ ప్రామిస్ చేసిందట..కాని అందుకు విఘ్నేశ్ ససేమిరా అంటున్నాడట.. ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారి చివరికి విడిపోయే స్టేజ్‌కు వచ్చిందంటూ తమిళ తంబీలు గుసగుసలాడుకుంటున్నారు.