English | Telugu

బెంగ‌ళూర్ డేస్ లో న‌య‌న‌తార

మ‌ల‌యాళంలో సూపర్ హిట్టైన బెంగ‌ళూర్ డేస్ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో దిల్ రాజు, పీవీపీ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో ఈ చిత్రానికి వేణు శ్రీ‌రామ్, తమిళ్ లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శత్వం వహించబోతున్నారు. కన్నడంలో నిత్యమీనన్ పోషించిన ప్రముఖ పాత్రను తెలుగు, తమిళ్ లో చేయడానికి న‌య‌న‌తార అంగీకరించినట్టు సమాచారం. ఈ పాత్ర కోసం నయనకు భారీగానే పారితోషిక‌౦ ఆఫర్ చేసినట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా అధికారికంగా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.