English | Telugu
విసిగిపోని నయనతార
Updated : May 14, 2015
నయనతారది విశాల హృదయం అని కోలీవుడ్ లో తెగ చెప్పుకుంటున్నారు. ఏం..ఏదైనా సామాజిక కార్యక్రమంలో పాల్గొంటోందా? లేదా కొంపతీసి మూవీ ప్రమోషన్లో పాల్గొంటోందా? అంటారా? మీరు కాస్త ఆగండి....నయన్ కు అంత సీన్ లేదండీ బాబూ. చేతిలో కాసు పడందే కాలు కూడా కదపదు. ఆసంగతి పక్కనపెడితే తారామణి మళ్లీ ప్రేమ పాటలు పాడుకుంటోందట. రీసెంట్ మూవీ 'నానుమ్ రౌడీ దాస్' దర్శకుడు విష్నేష్ శివన్ తో రాసుకుపూసుకు తిరుగుతోందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ మధ్య ఎక్కడ చూసినా వీళ్లిద్దరేనట. మరో ముఖ్య విషయం ఏంటంటే విఘ్నేష్ దర్శకుడు మాత్రమే కాదు... పాటల రచయిత కూడా. దీంతో బహుముఖ ప్రజ్ఞాశాలులకు వలేయడంతో నయన్ దిట్ట అంటున్నారు. ఎంత దిట్ట అయితే నేం...చివరికి మళ్లీ ఒంటరిగా మిగులుతోందిగా పాపం అని జాలి పడుతున్నవారూ లేకపోలేదు. పోనీ ఈసారైనా నయన్ ప్రేమ పెళ్లిపీటల వరకూ వెళుతుందో లేదో?