English | Telugu
నయనతార భారీ స్కెచ్!
Updated : Oct 10, 2015
నాలుగు దక్షిణాది భాషల్లో వరుసగా హీరోయిన్ వేషాలు, మధ్యమధ్యలో లవ్ కాంట్రవర్సీలతో హ్యాపీగా గడిచిపోతున్న నయనతార మనసు ఇప్పుడు కొత్త విషయాల మీదకి మళ్ళింది. ఇప్పుడు ఆమె మనసంతా ముంబై సినీ రంగం మీద, నేషనల్ అవార్డు మీద కేంద్రీకరించినట్టు సమాచారం. తాను దక్షిణాదిలో యమా ఇరగదీస్తున్న హీరోయిన్ అయిన్పపటికీ తాను కేవలం దేశంలో ఈ మూలకే పరిమితమైపోయానని, తనకంటే డిమాండ్ తక్కువ వున్న చాలామంది దక్షిణాది హీరోయిన్లు హిందీ సినిమాల్లో కూడా నటించేస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారని నయనతార ఫీలైపోతోందట.
అలాగే అవార్డుల విషయంలో కూడా తాను ముందడుగు వేయాలని భావిస్తోందట. ఈ స్టేట్ అవార్డూ, ఆ స్టేట్ అవార్డూ కాకుండా ఏకంగా జాతీయ అవార్డు కొట్టేయాలని నయనతార ఆలోచిస్తోందట. దీనికోసం చాలామంది మలయాళ దర్శకులని సంప్రదించిందట. తనకు నేషనల్ అవార్డు దక్కే సినిమా రూపొందిస్తే డబ్బులు తీసుకోకుండా యాక్ట్ చేస్తానని కూడా ఆఫర్లు ఇస్తోందట. అలాగే ఈ అందాల బాల బాలీవుడ్‌లో కూడా తన టాలెంట్ చూపించాలని ఉవ్విళ్ళూరుతోందట.
ఇటీవల నాలుగైదుసార్లు ముంబైకి వెళ్ళి అక్కడ కొంతమంది సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లని నయనతార మీటైందట. మొత్తానికి నయనతార ఈరెండు విషయాల మీద చాలా సీరియస్‌గా వున్నట్టు సమాచారం. ఈ మాయదారి మీడియా తనకు నెలకోసారి పెళ్ళిచేసేస్తూ వుంటుంది. తనకు నిజంగానే పెళ్ళయ్యేలోపు బాలీవుడ్ సంగతి, నేషనల్ అవార్డు సంగతి తేల్చేయాలని నయనతార గాఠ్ఠి పట్టుదల మీద వుందట.