English | Telugu

నాని ఒక్క స్టెప్.. నలుగురు హీరోలకు గండం

ఈ ఏడాది ఇప్పటికే రెండు హిట్లు కొట్టి మూడో సినిమాను రిలీజ్‌కు రెడీ చేశాడు నేచురల్ స్టార్ నాని. వేణు శ్రీరాం దర్శకత్వంలో నాని నటించిన "ఎంసీఏ"ను డిసెంబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాత దిల్‌రాజు ముందే ప్రకటించాడు. మళ్లీ ఏమైందో ఏమో తెలియదు కానీ రిలీజ్ డేట్‌ను 21కి మారుస్తారని ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు కబురు అందింది అంటున్నారు సినీ జనాలు. అదే గనుక జరిగితే నాలుగు సినిమాలకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

విక్రమ్ కుమార్- అఖిల్ కాంభినేషన్‌లో వస్తున్న "హలో"ని 22న రిలీజ్ చేస్తామని టీజర్‌లో చెప్పేశాడు నాగ్.. ఎంసీఏ 21న వస్తే అది హలో వసూళ్లపై ప్రభావం చూపిస్తుంది.. అందుకనే దిల్‌రాజును కన్విన్స్ చేసే పనిలో పడ్డాడట నాగ్. ఒకవేళ ఎంసీఏ 21కే ఫిక్స్ అయితే సునీల్ "టూ కంట్రీస్‌"‌ని 15న తీసుకువస్తారు. అదే టైంలో డిసెంబర్‌ 23న అల్లు శిరీష్ "ఒక్కక్షణాన్ని" రీలీజ్ చేస్తామని గీతా ఆర్ట్స్ ప్రకటించింది అయితే పరిస్థితి ఇలా ఉంటుందని అరవింద్ అప్పుడు ఊహించి ఉండడు. దీంతో ఈ మూవీ కూడా వారం వెనక్కు తీసుకువెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద నాని ఒక్క స్టెప్ ముందుకు వేసినా.. వెనక్కు వేసినా ఈ హీరోలకు గండమే.. ప్రస్తుతానికి ఈ నాలుగు సినిమాలే కనిపిస్తున్నా.. ఆ టైమ్‌కి ఇంకెన్నీ రెడీ అవుతాయో వేచి చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.