English | Telugu

అందుకే బోయపాటికి అవార్డ్ ఇచ్చారా..?

ఇటీవలి కాలంలో ఏ అవార్డుల ఎంపికలోనైనా లాబీయింగ్‌, పలుకుబడి, కులం, మతాలను ప్రాతిపదికగా తీసుకొని.. అయినవారికి.. తమకు కావాలనుకున్నవారికే పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు ఢిల్లీ నుంచి గల్లీ దాకా వినిపిస్తున్నాయి. తాజాగా 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నంది అవార్డులను ప్రకటించింది.

షరామామూలుగానే ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నందులపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు స్టార్ట్ అయ్యాయి. ప్రధానంగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి అవార్డు దక్కడం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలోని టీడీపీ సర్కార్‌కి అవసరమైనప్పుడల్లా అందుబాటులో ఉంటూ తనవంతు సాయం చేస్తున్నారు బోయపాటి. గోదావరి, కృష్ణా పుష్కరాల సమయంలోనూ.. పార్టీకి సంబంధించిన కొన్ని యాడ్స్ రూపకల్పన విషయంలోనూ శ్రీను హెల్ప్ చేశాడన్నది ఓపెన్ టాక్. అందుకు కృతజ్ఞతగానే లెజెండ్ సినిమాకు ఉత్తమ దర్శకుడితో పాటు, బీఎన్ రెడ్డి స్మారక పురస్కరాన్ని బోయపాటి ఖాతాలో వేశారని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.