English | Telugu

నాగ్ - అఖిల్‌.. ఇద్ద‌రికీ గ్యాప్ వ‌చ్చేసిందా??

తండ్రీ కొడుకులు నాగార్జున‌, అఖిల్ మ‌ధ్య గ్యాప్ వ‌చ్చిందా? ఇద్ద‌రి మ‌ధ్య‌ `అఖిల్‌` సినిమా దూరం పెంచిదా? ఔన‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. ప్ర‌స్తుతం ఈ తండ్రీ కొడుకుల‌కు అస్స‌లు ప‌డ‌డం లేద‌ట‌. ఇద్ద‌రూ ఎదురైతే... అక్క‌డ వాతావ‌ర‌ణం గంభీరంగా మారిపోతోంద‌ట‌. అఖిల్ సినిమా వాయిదా వేసినప్ప‌టి నుంచీ ఈ తండ్రీ కొడుకుల‌కు ప‌డ‌డం లేద‌ని తెలుస్తోంది. అఖిల్ ఎలాగైనా ఈసినిమాని పండ‌క్కి విడుద‌ల చేయాల‌ని ప‌ట్టుప‌ట్టాడ‌ని, అయితే నాగ్ ఒప్పుకోలేద‌ని తెలుస్తోంది.

అస‌లు వినాయ‌క్ తో సినిమా చేయ‌డానికి నాగ్‌... అర్థ‌మ‌స‌స్కంగానే అంగీక‌రించాడ‌ని, అందుకే.. ముందు నుంచీ నాగ్‌కి ఈ సినిమాపై పాజిటీవ్ ఫీలింగ్ లేద‌ని తెలుస్తోంది. సోషియో ఫాంట‌సీ క‌థ‌లంటే నాగ్‌కి ఏమాత్రం ఇష్టం లేద‌ట‌. అయినా అలాంటి క‌థ‌ని ఎంచుకోవ‌డంతో వినాయ‌క్‌నీ నాగ్ దూరం పెట్టాడ‌ట‌. సెట్‌కి ఒక‌ట్రెండు సార్లు మాత్ర‌మే వెళ్లాడ‌ట‌. ప‌దిహేను రోజుల క్రితం.. అఖిల్ సినిమాని చూసిన నాగ్‌... వినాయ‌క్‌ని పిలిచి క్లాస్ పీకాడ‌ట‌. కనీసం ఆరేడు స‌న్నివేశాల్ని రీషూట్ చేయాల‌న్నాడ‌ట‌.

ఇప్ప‌టికిప్పుడు ఆ సీన్ల‌ను రీషూట్ చేయాలంటే క‌ష్ట‌మ‌ని వినాయ‌క్ చెప్పాడ‌ట‌. దాంతో.. ఈ సినిమాని వాయిదా వేయాల్సివ‌చ్చింద‌ని టాక్‌. న‌వంబ‌రు 11న ఈ సినిమాని విడుద‌ల చేద్దామ‌నుకొన్నారు. అయితే.. ఇప్ప‌ట్లో అది సాద్య‌మ‌య్యే విష‌యం కాదు. అందుకే సంక్రాంతికి విడుద‌ల చేద్దామ‌ని చూస్తున్నారు. అంటే అఖిల్‌సినిమా సంక్రాంతి వ‌ర‌కూ రాద‌న్న‌మాట‌. ఈలోగా అయినా ఈ తండ్రీ కొడుకులు ఒక్క‌ట‌వుతారేమో చూడాలి.