English | Telugu

కంచెని బ్రూస్లీ తొక్కేస్తున్నాడు

ఇదేం అన్యాయం?? మ‌రీ ఇంత గుత్తాధిప‌త్య‌మా? ఫ్లాప్ అయిన సినిమాకి థియేట‌ర్లు బోలెడున్నాయి. కొత్త‌గా వ‌చ్చిన సినిమాకి, పాజిటీవ్ టాక్ ఉన్న సినిమాకి థియేట‌ర్లు లేవు. ప్ర‌స్తుతం కంచెకు ఎదుర‌వుతున్న ప‌రిస్థితి ఇది. గ‌త వారం విడుద‌లైన బ్రూస్లీ సినిమా ఫ్లాప్ అయిన సంగ‌తి తెల‌తిసిందే. రోజు రోజుకి వ‌సూళ్లు కూడా దారుణంగా ప‌డిపోతున్నాయి. ఫ్లాప్ అయిన సినిమా, అందులోనూ వ‌సూళ్లు లేవు.. అలాంటప్పుడు ఏం చేస్తారు? థియేట‌ర్ల‌లోంచి సినిమా తీసేస్తారు.

కానీ బ్రూస్లీ స్ట్రాట‌జీ వేరుగా ఉంది. వీలైన‌న్ని ఎక్కువ థియేట‌ర్ల‌ను క‌బ్జా చేసి.. ఆ థియేట‌ర్ల‌లో బ్రూస్లీ ని రీ రిలీజ్ చేయిస్తున్నారు. ఔను.. ఇది అక్ష‌రాలా నిజం. అఖిల్ సినిమా కోసం బ్లాక్ చేసిన థియేట‌ర్ల‌లో కంచె సినిమాని విడుద‌ల చేద్దామ‌నుకొన్నారు. అయితే.. కంచెకు థియేట‌ర్లు దొరక్కుండా చేసింది బ్రూస్లీ బృందం. బ్రూస్లీ ఆడుతున్న థియేట‌ర్ల‌లో జ‌నం లేరు. కానీ పక్క‌నున్న థియేట‌ర్ల‌నూ బ‌ల‌వంతంగా లాక్కుని.. అందులోనూ బ్రూస్లీని ఆడిస్తున్నారు. జ‌నం లేక‌పోయినా ఫ‌ర్వాలేదు, కావాలంటే ఎదురు డ‌బ్బులు క‌డ‌తాం.. అంటున్నార‌ట‌. `లేదు...మా కంచె కావాలి` అని అడిగితే.. `భ‌విష్య‌త్తులో మీకు సినిమాలు లేకుండా చేస్తాం` అని బ్లాక్ మెయిల్ చేస్తున్నార‌ట‌.

దాంతో కంచె సినిమాకు థియేట‌ర్లు లేకుండా పోయాయి. దీన్ని బ‌ట్టి మెగా ఫ్యామిలీ మ‌ధ్య ఎంత స‌ఖ్య‌త ఉందో అర్థ‌మ‌వుతోంది క‌దా? అప్పుడు రుద్ర‌మదేవిపై కావాల‌ని పోటీకి దిగిన బ్రూస్లీ.. ఇప్పుడు వ‌రుణ్ తేజ్ సినిమాని కావాల‌నే తొక్కేస్తున్నాడా, అందుకే బ్రూస్లీ కు జ‌నం లేక‌పోయినా... థియేట‌ర్ల‌ను క‌బ్జా చేసి బ‌ల‌వంతంగా సినిమా వేయిస్తున్నారు. ఇదేం న్యాయం అని అడిగేవాడే లేడు.. అదీ తెలుగు ఇండ్ర‌స్ట్రీ ప‌రిస్థితి.