English | Telugu

నాగ్ బ్లాక్ మెయిల్ చేశాడా??

తండ్రీ కొడుకుల కోల్డ్ వార్ ప్ర‌స్తుతం.. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అఖిల్ సినిమాని వాయిదా వేసిన విష‌యంలో అటు నాగార్జున‌కీ, ఇటు అఖిల్‌కీ బేదాభిప్రాయాలు వ‌చ్చాయ‌ని, ద‌ర‌స‌రాకు అఖిల్ సినిమా విడుద‌ల కాకుండా డాడీనే అడ్డుప‌డ్డాడ‌ని అఖిల్ భావిస్తున్నాడ‌ని, త‌న సినిమా వాయిదా వేయ‌డం అఖిల్‌కి న‌చ్చ‌లేద‌ని.. డాడీ నిర్ణ‌యం ప‌ట్ల చాలా ఇన్స‌ల్ట్ గా ఫీల‌య్యాడ‌ని వార్త‌లొచ్చాయి.

అఖిల్‌, నితిన్.. ఇద్ద‌రూ తీసుకొన్న నిర్ణ‌యం వ‌ల్లే.. వినాయ‌క్ ఈ ప్రాజెక్టులోకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ర‌షెష్ చూసిన నాగ్‌.. అసంతృప్తికి గుర‌య్యాడ‌ని, కొన్ని మార్పులూ, చేర్పులూ చెప్పాడ‌ని వాటికి అఖిల్ ఖాత‌రు చేయ‌లేద‌న్న టాక్ వినిపిస్తోంది. `ఇలాగైతే.. నీ సినిమాల గురించి నేనేం ప‌ట్టించుకోను.. ప్ర‌మోష‌న్ల‌కు రాను` అంటూ నాగ్ బ్లాక్ మెయిల్ కూడా చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ట్టు మ‌రో న్యూస్ ఒక‌టి టాలీవుడ్ లో షికారు చేస్తోంది. నాగ్‌, అఖిల్ ల మ‌ధ్య తీవ్ర‌మైన గ్యాప్ వ‌చ్చేసింద‌ని, అందుకే విడుద‌ల తేదీ వాయిదా వేసిన ప్రెస్ మీట్‌లో నాగార్జున మాత్ర‌మే పాల్గొన్నాడ‌ని, అఖిల్ రాలేద‌ని.. అప్ప‌టి నుంచీ తండ్రీ కొడుకుల‌కు మాట‌ల్లేవ‌ని తెలుస్తోంది.

ఇప్పుడు ఎట్ట‌కేల‌కు అఖిల్ సినిమా ముహూర్తం ఫిక్స‌య్యింది. ఈనెల 11న రావ‌డం గ్యారెంటీ. ఇది కూడా అఖిల్ ని కూల్ చేయ‌డానికి నాగ్ అంగీక‌రించాల్సివ‌చ్చింది. లేదంటే... అంద‌రూ అనుకొన్న‌ట్టు ఈ సినిమా సంక్రాంతికి రావాల్సిందే. అఖిల్ త‌న పంతం గెలిపించుకొన్నాడు. రీషూట్లూ, మార్పులూ ఏమీ లేకుండా త‌న సినిమాని తీసుకురాగ‌లుగుతున్నాడు. ఇక‌నైనా తండ్రీ కొడుకుల కోల్డ్ వార్ ఆగుద్దా? ఇద్ద‌రూ క‌ల‌సి ఇంట‌ర్వ్యూలు ఇస్తారా?? చూడాలి మ‌రి.