English | Telugu

ఎన్టీఆర్, బన్నీ ఫ్యాన్స్‌ చేతుల్లో తమన్నాకి మూడినట్లేనా..?


తను పనిచేసే హీరోల్ని, దర్శకుల్ని హీరోయిన్లు పొగడటం ఎప్పటి నుంచో జరుగుతుందే. అలా ఎందుకు పొగుడుతారో అందరికీ తెలిసిందే.. సదరు వ్యక్తులు తెలిసినవాళ్లకి తన గురించి రిఫర్ చేస్తాడనేది హీరోయిన్ల ఫీలింగ్. అయితే ఈ క్రమంలో వేరే వారిని తక్కువ చేయకూడదు కదా..? ఇప్పుడు ఇలాగే నోరు జారింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా.. చెప్పుకోదగ్గ హిట్లు లేకపోయినా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది తమన్నా. బాహుబలి హిట్‌తో ఆఫర్లు వస్తాయని భావించినప్పటికీ ఒక్క అవకాశం కూడా తమన్నా గుమ్మం తొక్కలేదు. ఇలాంటి టైంలో నందమూరి కళ్యాణ్‌రామ్ నా నువ్వే సినిమాలో పిలిచి హీరోయిన్‌గా ఛాన్సిచ్చాడు.

అందుకు కృతజ్ఞతలు చెప్పాలనుకుందో.. లేక మరేదైనా కారణమో కానీ కళ్యాణ్‌రామ్‌ను ఆకాశానికేత్తేసింది. కళ్యాణ్‌రామ్ మంచి డ్యాన్సర్‌ అని.. అతనే బెస్ట్ డ్యాన్స్ పార్టనర్‌ అని అంటూ పొగడ్తలతో ముంచేసింది. అయితే టాలీవుడ్‌లో బెస్ట్ డ్యాన్సర్లుగా పేరు తెచ్చుకున్న బన్నీ, ఎన్టీఆర్‌ల గురించి తెలిసికూడా.. కళ్యాణ్‌రామ్‌ని ఆ విధంగా అనడంపై వారిద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో భగ్గుమంటున్నారు. మరి ఈ విషయం తమన్నా దృష్టికి ఇంకా వెళ్లిందో లేదో మరి. ఇది మరింత పెద్దది కాకముందే మిల్కీ బ్యూటీ రియాక్ట్ అయితే మంచిది.